ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు.. వరి క్వింటాల్‌కు ₹2,441
2026-27 మార్కెటింగ్ సీజన్‌కు 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త ధరలకు ఆమోదం తెలిపారు.