బ్యాంకుల 'డార్క్ ప్యాటర్న్స్'కు ఆర్బీఐ చెక్.. బలవంతంగా ఆర్థిక ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు
బ్యాంకులు వినియోగదారులకు అవసరం లేని బీమా, పెట్టుబడి తదితర ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడం, డిజిటల్ వేదికల్లో వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే 'డార్క్ ప్యాటర్న్స్'ను ఉపయోగించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన ఆంక్షలు విధించింది.