
క్రికెట్ ప్రపంచంలో టీమ్ ఇండియా మరోసారి తన జైత్రయాత్రను కొనసాగించింది. మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి, భారత్ 2026 T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
రికార్డుల వరద
మొదట బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 255 రన్స్ చేసిన భారత్, 159 రన్స్ కి కివీస్ను ఆల్ అవుట్ చేసి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ మరియు భారతీయ ఆటగాళ్లు ఎన్నో రికార్డులను నెలకొల్పారు.

