Jeevana Rekha Logo
Jeevana Rekha Logo
రేఖ ఫ్లాష్
థీమ్
పిల్లల కథ కాదు... ​40 అడుగుల నిజమైన రాక్షసుడి తో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్! 'సైక్లోప్స్' ఎపిసోడ్‌ను మార్చేసిన నోలన్
సినిమా

పిల్లల కథ కాదు... ​40 అడుగుల నిజమైన రాక్షసుడి తో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్! 'సైక్లోప్స్' ఎపిసోడ్‌ను మార్చేసిన నోలన్

By Gunturi Sankar, Jeevana Rekha

40 అడుగుల నిజమైన రాక్షసుడి తో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్! 'సైక్లోప్స్' ఎపిసోడ్‌ను మార్చేసిన నోలన్

పిల్లల కథ కాదు... ​40 అడుగుల నిజమైన రాక్షసుడి తో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్! 'సైక్లోప్స్' ఎపిసోడ్‌ను మార్చేసిన నోలన్

హోమర్ రాసిన 'ది ఒడిస్సీ' అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్క కన్నున్న రాక్షసుడు 'పాలిఫెమస్' (Polyphemus - Cyclops) ఎపిసోడ్. గతంలో వచ్చిన పాత సినిమాల్లో లేదా కథల పుస్తకాల్లో దీనిని ఒక ఫాంటసీ అడ్వెంచర్‌లా, కాస్త ఫన్నీగానో లేదా పిల్లల కథలానో చూపించారు. కానీ క్రిస్టోఫర్ నోలన్ మాత్రం ఈ ప్రసిద్ధ ఎపిసోడ్‌ను థియేటర్లలో ప్రేక్షకులకు చెమటలు పట్టించేలా, ప్యూర్ హారర్ (Pure Horror) సీన్‌గా మార్చేశారు. నోలన్ కెరీర్‌లోనే ఇదొక మొట్టమొదటి పూర్తి స్థాయి హారర్ సీక్వెన్స్ అని ఫస్ట్ రియాక్షన్స్ ద్వారా తెలుస్తోంది.

సినిమాలోని ఈ గుహ (Cave) సన్నివేశంలో నోలన్ ఎక్కడా 'స్టోరీబుక్ ఫీలింగ్' రాకుండా చూసుకున్నారు. చీకటి గుహలో చిక్కుకున్న ఒడీసియస్ (మ్యాట్ డామన్) మరియు అతని సైనికులను ఆ రాక్షసుడు వేటాడే విధానాన్ని అత్యంత భయానకంగా, క్లాస్ట్రోఫోబిక్ (Claustrophobic) వాతావరణంలో తెరకెక్కించారు. ఆ రాక్షసుడి ముఖం ఒక వికృతమైన అబోమినేషన్ (Mutated Abomination) లాగా, శారీరక లోపాలతో భీతి గొలిపేలా డిజైన్ చేశారు. కేవలం ఐమాక్స్ 70mm స్క్రీన్ల కోసమే డిజైన్ చేసిన ఈ 15 నిమిషాల సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచుల మీద కూర్చోబెట్టడం ఖాయం.

40 అడుగుల నిజమైన రాక్షసుడు... నోలన్ ప్రాక్టికల్ విజువల్ వండర్ (40-Feet Practical Cyclops)-

ఈ హారర్ సీక్వెన్స్ అంత సహజంగా రావడానికి కారణం నోలన్ మళ్లీ కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) ని నమ్ముకోకపోవడమే. సాధారణంగా ఇలాంటి భారీ రాక్షసులను గ్రీన్ స్క్రీన్ ముందు సృష్టించి నటీనటులను ఊహించుకుని నటించమంటారు. కానీ నోలన్ మాత్రం సెట్స్ పైనే ఏకంగా 40 అడుగుల (12 మీటర్లు) భారీ యానిమాట్రానిక్ పప్పెట్ (Animatronic Puppet) రాక్షసుడిని నిజంగానే తయారు చేయించారు.

'ఇంటర్‌స్టెల్లార్' సినిమాలో 'TARS' రోబోకు ప్రాణం పోసిన ప్రముఖ పప్పెటీర్ బిల్ ఇర్విన్ (Bill Irwin) ఈ సైక్లోప్స్ రాక్షసుడి కదలికలను గైడ్ చేశారు. మ్యాట్ డామన్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెబుతూ—"గుహలో నుండి సైక్లోప్స్ నన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు, నిజంగానే ఒక 40 అడుగుల భీకరమైన రూపం నా వెనుక పడింది. అందుకే అక్కడ నా ముఖంలో కనిపించిన భయం గ్రాఫిక్స్ కాదు, 100% నిజం!" అని చెప్పారు.

లెజెండరీ 'రే హ్యారీహౌసెన్' చిత్రాలే నోలన్‌కు స్ఫూర్తి (Ray Harryhausen's Influence)-

అసలు హాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్, రియలిస్టిక్ డ్రామాలు తీసే నోలన్‌కు ఈ తరహా రాక్షసులను సృష్టించాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? దీనికి సమాధానం—స్టాప్-మోషన్ ఎఫెక్ట్స్ పితామహుడు రే హ్యారీహౌసెన్ (Ray Harryhausen). 'జాసన్ అండ్ ద అర్గోనాట్స్', 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' (1981) వంటి క్లాసిక్ మైథాలజీ సినిమాల్లో రే హ్యారీహౌసెన్ సృష్టించిన వింత జీవులు నోలన్‌కు చిన్నప్పుడే బాగా నచ్చేవట.

ఈ విషయంపై నోలన్ స్పందిస్తూ—"నేను చిన్నప్పుడు చూసి ఆనందించిన రే హ్యారీహౌసెన్ గారి రాక్షసుల కథలను, నేటి తరం ప్రేక్షకులకు ఒక భారీ హాలీవుడ్ ఎ-గ్రేడ్ (A-Budget) ఐమాక్స్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో అందిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి ఈ సినిమా పుట్టింది" అని తెలిపారు. పాత కాలపు సినిమాల్లో ఉండే ఆ జీవుల 'టాక్టైల్ ఫీల్' (భౌతిక ఉనికి) ని నేటి మోడ్రన్ టెక్నాలజీతో, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌తో మిక్స్ చేసి నోలన్ సృష్టించిన ఈ రాక్షసులు హాలీవుడ్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్తు మైలురాయిగా నిలిచిపోనున్నాయి.