Jeevana Rekha Logo
Jeevana Rekha Logo
రేఖ ఫ్లాష్
థీమ్
1986 నుండి నోలన్ కంటున్న కల... 'ది ఒడిస్సీ'తో సాకారమైన 40 ఏళ్ల నాటి ఐమాక్స్ ఆకాంక్ష!
సినిమా

1986 నుండి నోలన్ కంటున్న కల... 'ది ఒడిస్సీ'తో సాకారమైన 40 ఏళ్ల నాటి ఐమాక్స్ ఆకాంక్ష!

By Gunturi Sankar, Jeevana Rekha

ది ఒడిస్సీ'తో సాకారమైన 40 ఏళ్ల నాటి ఐమాక్స్ ఆకాంక్ష!

1986 నుండి నోలన్ కంటున్న కల... 'ది ఒడిస్సీ'తో సాకారమైన 40 ఏళ్ల నాటి ఐమాక్స్ ఆకాంక్ష!

క్రిస్టోఫర్ నోలన్ అనగానే మనకు ఐమాక్స్ (IMAX) స్క్రీన్లు, గ్రాండ్‌నెస్ గుర్తొస్తాయి. 'ది డార్క్ నైట్' (2008) లో కొన్ని యాక్షన్ సీన్ల కోసం మొదటిసారి ఐమాక్స్ కెమెరాలు వాడిన నోలన్, అప్పటి నుండి తన ప్రతి సినిమాలోనూ ఈ ఫార్మాట్ పరిధిని పెంచుకుంటూ వచ్చారు. అయితే, సినిమా మొత్తాన్ని (ప్రతి ఒక్క ఫ్రేమ్‌ను) కేవలం ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాలతోనే తీయాలనేది ఆయన 2026లో హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఆయన దాదాపు 40 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న ఒక పెద్ద కల.

తాజా ఇంటర్వ్యూలో నోలన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ—"నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే 1986లో మొదటిసారి ఒక ఐమాక్స్ డాక్యుమెంటరీని చూశాను. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను ఎంతగానో మైమరపించింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను... భవిష్యత్తులో నేను తీసే ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్‌ను కేవలం ఐమాక్స్ కెమెరాలతోనే రూపొందించాలని. ఆ కల ఈరోజు 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రంతో సాకారమైంది" అని ఎమోషనల్ అయ్యారు. సినిమా చరిత్రలోనే మొదటిసారి ఒక కమర్షియల్ హాలీవుడ్ డ్రామాను 100% ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాలతోనే షూట్ చేసి నోలన్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

హోయ్టే వాన్ హోయ్టేమా మరియు ఐమాక్స్ ఇంజనీర్ల అద్భుత సృష్టి (New Advanced IMAX Cameras)-

నోలన్ 1986 నుండి కంటున్న ఈ కలకు ఇన్నేళ్లుగా అడ్డుపడింది ఒకే ఒక్క సమస్య... అదే ఐమాక్స్ కెమెరాల నుండి వచ్చే భారీ శబ్దం. ఐమాక్స్ కెమెరా రన్ అవుతున్నప్పుడు లోపల పెద్ద ఫిల్మ్ రోల్ తిరగడం వల్ల జ్యాక్‌హ్యామర్ లాంటి భయంకరమైన సౌండ్ వస్తుంది. దీనివల్ల నటీనటులు పక్కపక్కనే కూర్చుని మాట్లాడే ఎమోషనల్, డైలాగ్ సీన్స్ (Intimate Scenes) షూట్ చేయడం అసాధ్యం.

ఈ సాంకేతిక సవాలును అధిగమించడానికి నోలన్ తన నమ్మకస్థుడైన ఆస్కార్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ హోయ్టే వాన్ హోయ్టేమా (Hoyte van Hoytema) మరియు ఐమాక్స్ కంపెనీకి చెందిన టాప్ ఇంజనీర్లను రంగంలోకి దించారు. వీరంతా కలిసి 'ది ఒడిస్సీ' సినిమా కోసమే ప్రత్యేకంగా సరికొత్త నెెక్ట్స్-జెన్ ఐమాక్స్ కెమెరాలను మరియు సౌండ్‌ప్రూఫ్ హౌసింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేశారు.

దీనిని చిత్రబృందం 'బ్లింప్' (Blimp) అని పిలుస్తుంది. కెమెరా చుట్టూ అమర్చిన ఈ ప్రత్యేక కవచం వల్ల కెమెరా లోపల వచ్చే శబ్దం బయటకు రాదు. దీనిపై నోలన్ స్పందిస్తూ—"ఈ బ్లింప్ సిస్టమ్ ఒక గేమ్ ఛేంజర్. నటీనటుల ముఖానికి కేవలం ఒక అడుగు దూరంలో కెమెరా పెట్టి, వారు అత్యంత గుసగుసలుగా మాట్లాడే డైలాగ్స్ ను కూడా ఎలాంటి నాయిస్ లేకుండా రికార్డ్ చేయగలిగాం" అని ప్రశంసించారు.

అయితే ఈ బ్లింప్ బాక్స్ వల్ల కెమెరా సైజు ఒక భారీ SUV కారు అంత పెద్దగా మారడంతో... నటీనటులు ఒకరినొకరు చూసుకోలేనంతగా అడ్డుపడేది. దానికోసం నోలన్ కెమెరా చుట్టూ అద్దాలను (Mirrors) అమర్చి, నటీనటులు ఆ అద్దాల ప్రతిబింబాల ద్వారా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ఐకాంటాక్ట్ మిస్ అవ్వకుండా నటించేలా సరికొత్త మిర్రర్ ట్రిక్ (Mirror Trick) వాడారు. హోయ్టే వాన్ హోయ్టేమా సాంకేతిక ప్రతిభ, ఐమాక్స్ ఇంజనీర్ల హార్డ్‌వేర్ సపోర్ట్ లేకపోతే నోలన్ 40 ఏళ్ల నాటి కల నిజమయ్యేది కాదని ఈ ప్రయోగాలు నిరూపిస్తున్నాయి.